ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రారంభానికి సిద్ధమవుతున్న బుద్ధవనం.. - తెలంగాణలో బుద్ధవనం

దేశంలో ఎక్కడాలేని విధంగా బుద్ధుడి పుట్టుక నుంచి మహాపరినిర్యాణం వరకు పూర్తి చరిత్ర ఒకేచోట తెలుసుకునేలా నాగార్జునసాగర్‌లో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రారంభానికి సిద్ధమవుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌ అధికారులను సర్కార్‌ సంప్రదించినట్లు సమాచారం.

buddhavanam
బుద్ధవనం విహంగ వీక్షణం

By

Published : Nov 7, 2020, 10:39 AM IST

బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నిర్మించిన ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం నాగార్జునసాగర్‌లో సుందరంగా ముస్తాబైంది. ఆసియాలోకెల్లా పెద్దదైన పార్కును 275 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కృష్ణానది ఒడ్డున సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 13న పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో చర్చించి ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి భవన్‌ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్కును ప్రారంభించనున్నారు.

బుద్ధవనం ప్రాజెక్టును మొత్తం ఎనిమిది విభాగాల్లో పనులు చేపట్టాల్సి ఉండగా...తొలుత ఐదు విభాగాల్లో చేపట్టిన స్థూపం పార్కు, జాతక పార్కు, బుద్ధచరిత్ర వనం, ధ్యానవనం, మహాస్థూపం పనులన్నీ ఈ నెల 15లోగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది.

ఎటూ చూసినా పచ్చదనం పరుచుకున్న బుద్ధవనం పార్కు మరికొద్ది రోజుల్లో ప్రజల సందర్శించేందుకు వీలుగా అందుబాటులోకి రానుంది.

ప్రారంభానికి సిద్ధమవుతున్న బుద్ధవనం..

ఇవీ చూడండి:10 ఉపగ్రహాలతో నేడు నింగిలోకి పీఎస్ఎల్వీసీ 49

ABOUT THE AUTHOR

...view details