ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు - సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరుకావాలని హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది.

cm jagan case
cm jagan case

By

Published : Feb 5, 2021, 9:47 AM IST

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతుల్లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కోదాడ పోలీసుస్టేషన్‌లో జగన్ పై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. కేసులో ఏ2, ఏ3గా ఉన్న నిందితులపై అక్కడి న్యాయస్థానం కేసు కొట్టేయగా.. ఏ1గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. ఫిబ్రవరి 12న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details