ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీమ పౌరుషానికి సీఎం కట్టుబడితే.. రెఫరెండంకు ముందుకు రావాలి' - తెదేపా నేత పట్టాభి తాజా వార్తలు

అత్యధిక సీట్లు గెలుచుకున్న బలమైన నాయకుడు జగన్ 15 నెలల్లోనే బలహీనపడ్డారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండంకు సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ పౌరుషానికి కట్టుబడేవారైతే రెఫరెండంకు ముందుకు రావాలని సవాల్ చేశారు.

tdp pattabhi
tdp pattabhi

By

Published : Sep 11, 2020, 3:52 PM IST

151 సీట్లు గెలుచుకున్న బలమైన నాయకుడు 15నెలల్లోనే బలహీనపడ్డాడని తెదేపా అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలో, వద్దో అనేదానిపై రెఫరెండంకు సీఎం జగన్ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ముందుకు రావడానికి ముఖం చాటేసి.. తన భావాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారని దుయ్యబట్టారు.

గతంలో గోవా, డయ్యూ-డామన్​కి సంబంధించి 1966లో రెఫరెండం నిర్వహించేలా పార్లమెంట్​లో చట్టం చేశారన్న పట్టాభి.. గోవాను మహారాష్ట్రలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే.. స్థానికులు ఆనాటి ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా ఉద్యమించారని గుర్తు చేశారు. ఏపీలోనూ ఒక రెఫరెండం పెట్టాలని జగన్ కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేశారు. తోకముడిచి పారిపోవడంలో జగన్ పేటెంట్ రైట్స్ పొందారని.. రాయలసీమ పౌరుషానికి కట్టుబడేవారైతే రెఫరెండంకు ముందుకు రావాలని సవాల్ చేశారు.

ఇదీ చదవండి:అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details