వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రిలయన్స్ సంస్థలపై జరిగిన దాడుల కేసులు ఎత్తివేయడంపై తెదేపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఇష్టానుసారం తనకు నచ్చిన వారిపై కేసులు ఎత్తివేయడమేంటని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఏ కారణంతో వారిపై కేసులు ఎత్తివేశారో తెలపాలని డిమాండ్ చేశారు. అమాయకులైన రాజధాని రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెడుతున్న ప్రభుత్వం.. ఆస్తులు ధ్వంసం చేసిన వారిని మాత్రం వదిలిపెడుతోందని మండిపడ్డారు.
'పెట్టడం.. ఎత్తివేయడం.. అంతా వారి ఇష్టమేనా!' - సీఎం జగన్‌పై బుద్దా వెంకన్న విమర్శలు
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులతో సామాన్యులు కూడా ఇబ్బందిపడుతున్నారని.. కులాలు, మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని తెదేపా నేత బుద్దా వెంకన్న అన్నారు. రిలయన్స్ సంస్థలపై జరగిన దాడుల కేసులు ఎందుకు ఎత్తివేశారో చెప్పాలన్నారు.
సీఎం జగన్‌పై బుద్దా వెంకన్న విమర్శలు
TAGGED:
సీఎం జగన్‌పై తెదేపా విమర్శలు