అమరావతిపై మంత్రి బొత్స, వైకాపా ఎమ్మెల్యే వ్యాఖ్యలను తెదేపా నేతలు కళా వెంకట్రావ్, అచ్చెన్నాయుడు, మాణిక్యవరప్రసాద్ తప్పుబట్టారు. డబ్బు లేకపోతే రాజధానిని ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఎవరు అడిగారని రాజధానిని మారుస్తున్నారని నిలదీశారు. సజావుగా ఉన్న శాసనసభ, సచివాలయం, హైకోర్టుపై వైకాపా గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. అమరావతిలో తెదేపా ప్రభుత్వం 9 వేల 597 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు. 5 వేల 800 కోట్లే ఖర్చు పెట్టామని వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
డబ్బు లేదని రాజధాని మారుస్తారా : తెదేపా నేతలు - వైసీపీపై టీడీపీ కామెంట్స్
అమరావతిపై మంత్రులు, వైకాపా నేతల వ్యాఖ్యలను తెదేపా నేతలు ఖండించారు. డబ్బు లేదనే సాకుతో రాజధానిని తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో తెదేపా ప్రభుత్వం 9 వేల 597 కోట్లు ఖర్చు పెట్టిందన్న నేతలు... వైకాపా అవాస్తవాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు.
డబ్బు లేదని రాజధాని మారుస్తారా : తెదేపా నేతలు