ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల అరెస్టులు, గృహ నిర్భందాలు

ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులను పరిశీలించేందుకు తెలుగుదేశం నాయకులు వెళ్లాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళుతున్న నేతలను అడ్డుకోవడంపై వారు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేశారంటూ ఆరోపించారు.

tdp leaders arrests across the state
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల అరెస్టులు

By

Published : May 24, 2021, 9:47 PM IST

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన జిల్లా వైద్యశాలలో కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలను తెలుసుకునేందుకు వెళుతున్న తెదేపా తెనాలి పట్టణ మాజీ అధ్యక్షులు ఖుద్ధుస్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో కరెంటు సరఫరా సమస్యలు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం వసతులు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఆసుపత్రుల సందర్శనకు వెళ్లకుండా కొత్తపేట పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేటలో పలువురు తెదేపా నాయకులకు నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ఉన్నవి లేనట్లు - లేనివి ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించేందుకు వెళుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు జడ్. శివప్రసాద్ లను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే తాము ఆమరణ నిరహార దీక్ష చేపడుతామని ప్రకటించారు. కరోనా బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెలుతుంటే తమను నిర్బంధించడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు.

చిత్తూరు జిల్లాలో..

తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన కరోనా బాధితులకు భరోసా కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో పోలీసులు భగ్నం చేశారు. కొవిడ్ ఆసుపత్రికి బయల్దేరేందుకు ప్రయత్నించిన పలమనేరులో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని నిలువరించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. విపక్షాలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నేతలు మండిపడ్డారు.

విశాఖ జిల్లాలో..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న కరోనా సేవలు పరిశీలించడానికి వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్​ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని పరిశీలించడానికి వెళ్తున్న ఆయనను పెందుర్తి లోని ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డొల్లతనం బయటపడుతుందని భయంతోనే ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడిందని ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో..

కరోనా వ్యాధి రాకుండా రాష్ట్ర ప్రజలు సీఎం జగమోహన్ రెడ్డి కంటే ఆనందయ్యనే నమ్ముతున్నారని తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. తెదేపా రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు కందికుంట ప్రసాద్ అనంతపురం సర్వజనాసుపత్రిలో సౌకర్యాలు పరిశీలించి, కరోనా రోగులను పరామర్శించటానికి వెళ్లిన ఆయనను పోలీసులు స్టేషన్​కు తరలించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద నమోదు చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్ ఇచ్చి అనంతపురం నగరం వెలుపల వదిలేశారు.

ఇవీ చదవండి:

బంగాల్​ హింసపై సీజేఐకి మహిళా న్యాయవాదుల లేఖ

కౌలు డబ్బులు చెల్లించాలని రాజధాని రైతుల విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details