'చాలా వచ్చాయి.. అన్నింటినీ అడ్డుకున్నామా..?' - సెలెక్ట్ కమిటీపై మాట్లాడిన యనమల రామకృష్ణుడు
అసెంబ్లీ నుంచి మండలికి చాలా బిల్లులు వచ్చాయని... వాటన్నింటినీ తాము అడ్డుకోలేదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి వచ్చిన వాటిలో రెండింటిని మాత్రమే వెనక్కి పంపామని వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే బిల్లులు తీసుకొస్తే ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు.
యనమల రామకృష్ణుడు