ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ.. ఎందుకంటే..? - అక్రమ తవ్వకాలపై వర్లరామయ్య లేఖ

Varla Ramaiah letter to Peddireddy: సత్యవేడులోని ఆరణి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైకాపా నేతల అండతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలపై అధికారులు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఇసుక తవ్వకాల వీడియోలను విడుదల చేశారు.

Varla Ramaiah letter to Peddireddy
పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

By

Published : May 14, 2022, 8:32 AM IST

Varla Ramaiah letter to Peddireddy: గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. సత్యవేడులోని ఆరణి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అక్రమంగా తవ్విన ఇసుక తమిళనాడుకు తరలిస్తున్నారని... రాష్ట్రానికి ఆర్థిక నష్టంతోపాటు సహజ వనరులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను ఏపీ లారీల్లో లోడ్‌ చేసి వే బిల్లు సిద్ధం చేస్తారని... తమిళనాడు ట్రక్కులోకి మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో వెల్లడించారు.

ఒకే వేబిల్లుపై అనేకసార్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని వాపోయారు. వైకాపా నేతల అండతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరణి నది ఒడ్డున ఉన్న గ్రామాలకు వరద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తవ్వకాలపై అధికారులు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆరోపించారు. ఇసుక తవ్వకాల వీడియోలను వర్ల రామయ్య విడుదల చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details