రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో వైరస్ కేసులు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు సలహాలు ఇస్తుంటే వాటిని పట్టించుకోకపోగా.. ఆయన్ను విమర్శించడం వైకాపా నేతలకు తగదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు.
'రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం' - సీఎం జగన్పై చినరాజప్ప ఆగ్రహం
రాష్ట్రంలో వైరస్ కేసులు రోజురోజుకూ అధికమవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని... తెదేపా నేత చినరాజప్ప మండిపడ్డారు. వైకాపా పాలనలో ప్రజలు, రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
వైకాపా ప్రభుత్వంపై చినరాజప్ప విమర్శలు