కరోనా బాధితులకు చికిత్స అందించకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం.. ప్రజలను నిందించటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్, మంత్రులు వైరస్‌పై కనీస అవగాహన లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పడకలు, ఆక్సిజన్, మందులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని లోకేశ్ ఆరోపించారు.
మంత్రి పేర్ని నాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: లోకేశ్
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు సరైన వైద్యం అందించలేని ప్రభుత్వం.. ప్రజలను నిందించడం దారుణమని అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేత నారాలోకేశ్
కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్, కనీస సౌకర్యాలు లేక కొవిడ్ బాధితులు మృతి చెందారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కించపరుస్తూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఇదీచదవండి.