ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జీఎన్‌రావు కమిటీ అందరినీ కలిశామని చెప్పడం అబద్ధం' - అమరావతిలో తెదేపా నేత బొండా ఉమ

రాష్రంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించిన శివరామకృష్ణన్‌ కమిటీ.. విశాఖ రాజధానికి అనుకూలంగా లేదని చెప్పిందని తెదేపా నేత బొండా ఉమ తెలిపారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో రాజధాని వద్దని ఆ కమిటీ సూచించిందని ఆయన పేర్కొన్నారు.

tdp leader bonda uma
tdp leader bonda uma

By

Published : Jan 29, 2020, 5:39 PM IST

'జీఎన్‌రావు కమిటీ అందరినీ కలిశామని చెప్పడం అబద్ధం'

ఎవరినీ అడగకుండానే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు వేశారని తెదేపా నేత బొండా ఉమ మండిపడ్డారు. కమిటీ 6 రోజుల్లోనే రాష్ట్రమంతా తిరిగిందా? అని ప్రశ్నించారు. జీఎన్‌రావు కమిటీ అందరినీ కలిశామని చెప్పడం అబద్ధం అని అన్నారు. తాడేపల్లిలో సిద్ధమైన పత్రాలపై కమిటీ సంతకాలు చేసిందన్నారు. చివరకు ఆ కమిటీ కూడా విశాఖకు దూరంగా రాజధాని పెట్టాలని సిఫారసు చేశారని ఆయన అన్నారు. ఈ కమిటీ నివేదిక విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా ఉందని, ఆ నివేదిక చూశాక అక్కడ ఎవరైనా రూపాయి పెట్టుబడి పెడతారా అంటూ ప్రశ్నించారు. అసలు జీఎన్​రావు కమిటీకి ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. కేవలం వైకాపా నేతల రాజకీయ స్వార్థంకోసమే ఆ కమిటీనిఏర్పాటుచేశారని విమర్శించారు. విశాఖ నగరంలో కొన్ని బృందాలు భూ కబ్జాల కోసం తిరుగుతున్నాయని ఆరోపించారు. కేవలం అమరావతిని కనుమరుగు చేయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details