ETV Bharat / city

'సముద్రతీరానికి దూరంగా రాజధాని ఉండాలని సిఫార్సు చేశాం'

author img

By

Published : Jan 29, 2020, 4:38 PM IST

Updated : Jan 29, 2020, 5:09 PM IST

విశాఖలో రాజధానిని సముద్రతీరానికి దూరంగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్లు నిపుణుల కమిటీ ఛైర్మన్ జీఎన్ రావు స్పష్టం చేశారు.విశాఖకు 50 కి.మీ దూరంలో రాజధానిని నిర్మించాలని చెప్పినట్లు వెల్లడించారు.

expert-commiite-chairman-gn-rao-comments-on-vishaka-capital-city
expert-commiite-chairman-gn-rao-comments-on-vishaka-capital-cityexpert-commiite-chairman-gn-rao-comments-on-vishaka-capital-city
మీడియాతో మాట్లాడుతున్న జీఎన్ రావు

విశాఖకు తుపాన్లు ముప్పు అని జీఎన్​ రావు, బోస్టన్​ కమిటీ నివేదికలు ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో నిపుణుల కమిటీ ఛైర్మన్ జీఎన్​ రావు స్పందించారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... సముద్రతీరానికి దూరంగా రాజధానిని నిర్మించాలని సూచించినట్లు స్పష్టం చేశారు. విశాఖకు 50 కి.మీ దూరంలో రాజధానిని నిర్మించాలని చెప్పినట్లు వెల్లడించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. తుపాన్లు అన్ని ప్రాంతాల్లో వస్తాయన్న ఆయన.... సముద్రతీర ప్రాంతం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.

అత్యుత్తమం విశాఖనే...

తాము ఇచ్చిన నివేదికలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖనే అత్యుత్తమమని చెప్పినట్లు జీఎన్ రావు అన్నారు. శాసన రాజధానిగా అమరావతి ఉండాలని సూచించామని తెలిపారు. మేం సిఫార్సులే చేస్తామన్న ఆయన... ప్రభుత్వం ఏం చేస్తుందో తమకు తెలియదన్నారు. సమర్థవంతమైన పాలన కోసం రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించాలని కోరామని స్పష్టం చేశారు.

ఎందరో నిపుణులను కలిసి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చామని జీఎన్ తెలిపారు. అభిప్రాయాలు తీసుకునేందుకు అందరి ఇళ్లకూ వెళ్లలేం కదా అని వ్యాఖ్యానించారు. 4వేల మంది రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడామని వెల్లడించారు. తమ కమిటీ రిపోర్టులను కొందరూ తగలబెట్టడంపై విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : మండలి రద్దుకు, రాజధాని అంశానికి సంబంధం లేదు: బొత్స

Last Updated : Jan 29, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.