అరాచకత్వం, అహంకారం, కక్షసాధింపులతో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను అరెస్ట్ చేయడం ద్వారా... తెదేపాకి అండగా ఉన్న బడుగు, బలహీన వర్గాలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక 946 అక్రమ కేసులు నమోదైతే, 346 కేసులు బీసీలపైనే నమోదు చేశారని ఆరోపించారు. ప్రజల పక్షాన తెదేపా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వ విధానాలపై... తెలుగుదేశం పోరాటాన్ని ఆపడం జగన్ ప్రభుత్వం వల్ల కాదని స్పష్టంచేశారు.
తేదేపా పోరాటాన్ని ఆపటం జగన్ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు: బచ్చుల అర్జునుడు - వైకాపాపై మండిపడ్డ తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
తెదేపాకి అండగా ఉన్న బడుగు, బలహీన వర్గాలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్రలపై కావాలనే కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.
వైకాపాపై మండిపడ్డ బచ్చుల అర్జునుడు