విశాఖకు తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు ఎత్తు తగ్గించటానికి.. పోలవరం విజయసాయి ఇంటి ప్రహరీ గోడ కాదని దుయ్యబట్టారు. విశాఖనంతా దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని విజయసాయి అనటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప విశాఖకు ఏం చేశారని నిలదీశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం, ఉన్న పెట్టుబడులు తరిమేయటం తప్ప మరేం చేయలేదని విమర్శించారు.
'ఇష్టం వచ్చినట్లు ఎత్తు తగ్గించటానికి... పోలవరం మీ ఇంటి ప్రహరీ గోడ కాదు' - TDP leader Ayyanna patrudu news
ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖనంతా దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని విజయసాయి అనటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
తెదేపానేత అయ్యన్నపాత్రుడు