ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 2, 2021, 2:56 AM IST

ETV Bharat / city

TDP ON NAGERA PENDING BILLS: ఉపాధి బిల్లుల బకాయిలపై రాష్ట్రవ్యాప్త నిరసనకు తెదేపా పిలుపు

ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై మరో నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం(tpd) పార్టీ పిలుపునిచ్చింది.నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని ఎంపీడీవో(mpdo) కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలు నిరసన తెలపనున్నారు.

TDP ON NAGERA PENDING BILLS
ఉపాధి బిల్లుల బకాయిలపై రాష్ట్రవ్యాప్త నిరసనకు తెదేపా పిలుపు

ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్‌ బిల్లుల విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై మరో నిరసన(protest) కార్యక్రమానికి తెదేపా(tdp) పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలోని ఎంపీడీవో(mpdo) కార్యాలయాల్లో... పార్టీ కార్యకర్తలు నిరసన తెలపనున్నారు. 5 డిమాండ్లతో అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. పెండింగ్‌ బిల్లులపై ఇప్పటికే కలెక్టర్లకు తెలుగుదేశం నేతలు వినతిపత్రాలు అందించారు. జూలై నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details