Suspense on Inter results: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు జాప్యంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిజల్ట్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
గత నెల 3న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిసినా.. ఇప్పటివరకు ఫలితాలపై బోర్డు స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. బోర్డు నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్స్.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.