సీఎం జగన్ తీరును భాజపా ఎంపీ సుజనా చౌదరి ఖండించారు. రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు... ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఉందని విమర్శించారు. ప్రపంచమంతా కరోనాపై పోరాట చేస్తుంటే సీఎం జగన్ మాత్రం సొంత కక్షలు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతోనే రమేశ్ కుమార్ పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారని దుయ్యబట్టారు. కక్ష పూరిత చర్యలు మానుకుని కరోనాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
కక్ష సాధింపు వద్దు.. కరోనా నివారణపై దృష్టి పెట్టండి: సుజనా - ramesh kumar removed as sec
ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే సీఎం జగన్ మాత్రం కక్ష తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారని భాజపా ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.
sujana chowdary comments on cm jagan over ramesh kumar removed
Last Updated : Apr 11, 2020, 11:29 AM IST