ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'2021-22 బత్తాయి, నిమ్మ ఉత్పత్తుల సంవత్సరం'

2021-22 ఏడాదిని బత్తాయి, నిమ్మ ఉత్పత్తుల సంవత్సరంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. బత్తాయి, నిమ్మ ఉత్పత్తుల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా..ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా బత్తాయి, నిమ్మ సాగు శిక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

kannababu
kannababu

By

Published : Jun 8, 2021, 7:53 PM IST

ఈ ఏడాదిని బత్తాయి, నిమ్మ ఉత్పత్తుల సంవత్సరంగా ప్రకటిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. రెండు వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, ప్రాధాన్యం కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏడాదిని నిమ్మ, బత్తాయి సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.

వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రి.. రైతు భరోసా కేంద్రాల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ, సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి వివరించారు. మన రాష్ట్రంలో పండే బత్తాయి, నిమ్మ పండ్ల దేశీయ రకాలకు మరింత ప్రాచుర్యం కల్పించి జాతీయ స్థాయిలో పేరొందెలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు- ఉద్యాన శాఖ సంయుక్తంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:Love cheating: ప్రేమన్నారు..మోసగించారు..ఒక్కరు కాదు..!

ABOUT THE AUTHOR

...view details