Krishna Janmastami 2022 రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద కాళీయమర్థనునికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గోవర్థనుని శోభాయమానంగా అలంకరించి.. సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో.. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని కృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు, గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులు - శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు 2022
Krishnastami Celebrations రాష్ట్రవ్యాప్తంగా శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇస్కాన్ జగన్నాథ మందిరంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఉట్టి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. తోలుబొమ్మలాట, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. 108 రకాల పిండివంటలతో భోగం అర్పించారు. పలుచోట్ల చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు.
అనంతపురంలోని ఇస్కాన్ మందిరం విద్యుత్ కాంతులతో వెలుగులీనుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాధాకృష్ణ స్వామిని దర్శించుకున్నారు. చిన్ని కృష్ణుని వివిధ రూపాల్లో చిన్నారులు సందడి చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రథంపై కృష్ణుని విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. విశాఖలో అంతర్ పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విభిన్న రకాల అలంకరణలతో చిన్నారులు అలరించారు. అల్లూరి జిల్లా వర రామభద్రపురం మండలం వడ్డిగూడెంలో కృష్ణాష్టమి వేడుకలు వినూత్నంగా జరిపారు. వరద బాధితులను ఆదుకోవాలంటూ.. వరద నీటిలో ఉట్టికొట్టి నిరసన తెలిపారు.
ఇవీ చదవండి: