రాష్ట్రంలో చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను... సకాలంలో పూర్తి చేసి రైల్వేకు అప్పగిస్తామని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అమరావతి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని రైల్వే జీఎంను కోరారు. ఇప్పటికే చేపట్టిన 17 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో.... అప్రోచ్ రోడ్డులకు సంబంధించిన వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా... భవిష్యత్తులో ఆర్వోబీ ల వద్ద ఏర్పాటు చేసే అప్రోచ్ రోడ్ల నిర్మాణ ఖర్చు మాత్రం రైల్వే శాఖనే భరించాలని వారికి విజ్ఞప్తి చేశారు.
''ఇప్పటికైతే ఆ ఖర్చు మాదే.. తర్వాత బాధ్యత మీదే'' - lv subramanyam
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. నూతనంగా ప్రారంభించనున్న రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను వేగంవంతం చేయాలని సీఎస్ ను జీఎం కోరారు.
ఆర్వోబీల వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం ఖర్చు మీదే... రైల్వే జీఎంతో సీఎస్