ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల కోసమే ఈ రైళ్లు.. నడిపిన దక్షిణ మధ్య రైల్వే.. - దక్షిణ మధ్య రైల్వే

రైతులకు మేలుచేయడం కోసం, మార్కెట్ సదుపాయాల్ని కల్పించడం కోసం దక్షిణ మధ్య రైల్వే కిసాన్‌ రైళ్లను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం నుండి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను మొదటిసారిగా రవాణా చేసింది.

రైలు
రైలు

By

Published : Aug 22, 2021, 5:09 PM IST

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే కిసాన్‌ రైళ్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి కిసాన్‌ రైళ్లను నడిపించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను దక్షిణ మధ్య రైల్వే మొదటిసారిగా రవాణా చేసింది.

ఉల్లిపాయల రవాణాపై తాడేపల్లిగూడెం రైతులతో, వ్యాపారులతో విజయవాడ డివిజన్‌లోని బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ (బీడీయూ) బృందం సమావేశాలు నిర్వహించింది.

రైల్వే వారిచే కల్పించబడిన వివిధ పథకాలు, రాయితీలకు సంబంధించిన అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించింది. కేంద్ర ఫుడ్‌ ప్రాససింగ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ గ్రీన్స్‌ టీవోపీ టు టోటల్‌ పథకం కింద అందజేస్తున్న 50శాతం రాయితీని సరుకు రవాణా వినియోగదారుల ఉత్పత్తులకు కూడా వర్తింపజేసిందని వ్యాపారులకు తెలియజేసింది.

కిసాన్‌ రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సురక్షితంగా, ఆర్థిక ప్రయాజనకరంగా ఉండడమే కాకుండా తక్కువ రవాణా ఖర్చుతో నిరాటంకంగా, రవాణా మార్గంలో వస్తువులు చెడిపోకుండా ఉంటుందని వివరించింది. ఇది తక్కువ పరిమాణంలో సరుకులను లోడింగ్‌ చేసే వ్యవసాయదారులకు, వ్యాపారులకు కార్గో నిర్వాహకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే ద్వారా తమ సరుకులు రవాణా చేసేందుకు చాలా మంది రైతులు, వ్యాపారులు ముందుకు వచ్చారని రైల్వేశాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:కిసాన్ రైళ్లలో అనంతపురం జిల్లా ఉత్పత్తుల రవాణాకు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details