విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా ప్రభుత్వం నిర్ణయించిందని, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి సచివాలయంలో కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. విశాఖలో వసతిసౌకర్యాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మే 31లోపు ఉద్యోగులను తీసుకెళ్లాలన్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
'ఉద్యోగులూ.. విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి' - సచివాలయ ఉద్యోగుల సమావేశం
విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన ఏ క్షణమైనా ప్రభుత్వ ఉత్తర్వులు రావచ్చన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం విశాఖలో వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని వెంకట్రామిరెడ్డి కోరారు.
సచివాలయ ఉద్యోగుల సమావేశం
TAGGED:
సచివాలయ ఉద్యోగుల సమావేశం