ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

5 నుంచి మలి విడత వ్యాక్సినేషన్

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్​కు మలి విడత వ్యాక్సినేషన్​కు ఫిబ్రవరి 5 నుంచి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. 10 రోజుల్లో 2.50 లక్షల మందికి ఇవ్వనున్నారు.

vaccination
5 నుంచి మలి విడత వ్యాక్సినేషన్

By

Published : Jan 29, 2021, 7:20 AM IST

కొవిడ్‌ టీకా పంపిణీ మలి విడతను ఫిబ్రవరి 5 తర్వాత ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 16 నుంచి ఆరోగ్య సిబ్బందికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు ఇస్తున్నారు. గుర్తించిన 3.88 లక్షల మందిలో గురువారం నాటికి 1,66,711 మందికి టీకా వేశారు. మిగిలిన వారికి ఫిబ్రవరి 4లోగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


*ప్రాథమిక అంచనా ప్రకారం రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు, మున్సిపల్‌, ఇతర శాఖల్లోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ఫిబ్రవరి 5 నుంచి టీకా వేస్తారు. 10 రోజుల్లో 2.50 లక్షల మందికి ఇవ్వనున్నారు. బీ 3వ విడతలో మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 5 మధ్య 4.50 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు తొలి విడత డోసు ఇస్తారు.


రియాక్షన్‌పై 53 కేసులు: టీకాల పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 54 మందిలో దుష్ఫలితాలు కనిపించాయి. ఇందులో స్వల్ప రియాక్షన్స్‌ కేసులు 42, మధ్యస్థం 9 కేసులు ఉన్నాయి. ఇద్దరిలో తీవ్రంగా కన్పించాయి. టీకా వేయించుకున్న తర్వాత గుంటూరు జిల్లాలో ఆశా కార్యకర్త ఒకరు మరణించగా, ఒంగోలుకు చెందిన దంత వైద్యురాలు అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఈ రియాక్షన్స్‌కు కారణాలు పరిశోధిస్తున్నారు.

కరోనా కేసులు 117:

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 36,189 నమూనాలు పరీక్షించారు. 117 (0.31%) మందిలో పాజిటివ్‌గా తేలింది. 8 జిల్లాల్లో పదిలోపు కేసులు వచ్చాయి. కొత్తగా మరణాలు నమోదుకాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,30,12,150 నమూనాలు పరీక్షించగా.. 8,87,466 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. 7,152 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 847 మంది చనిపోయారు.

ఇదీ చదవండి:100 గజాల్లో రూ.3 లక్షలతో ఇల్లు... తెదేపా మేనిఫెస్టో విడుదల

ABOUT THE AUTHOR

...view details