రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ నియామకం హర్షణీయమని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ఇప్పటి వరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్ఈసీలుగా నియమితులవుతూ వచ్చారని చెప్పారు. ఈ పద్ధతి వల్ల రిటైర్డ్ ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దల వద్ద పని చేయటం వల్ల చాలా సందర్భాల్లో వారి నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకుగానూ..ఎస్ఈసీగా రిటైర్డ్ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో ఉన్న తెదేపా ప్రభుత్వ హయాంలోనూ చాలా మంది ప్రభుత్వాధికారులను తొలగించారని గుర్తు చేశారు.
'కొత్త ఎస్ఈసీ నియామకం హర్షణీయం' - latest updates of corona
నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత న్యాయమూర్తిని నియమించిన నేపథ్యంలో త్వరలో జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
samineni udayabhanu reaction on sec change