ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sadar Celebrations: తెలంగాణలో అట్టహాసంగా సదర్‌ సంబురాలు - Sadar Celebrations

హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకి అద్దం పట్టే సదర్ వేడుకలు.. అట్టహాసంగా జరుగుతున్నాయి. దున్నపోతులను అందంగా అలంకరించి.. వాటితో విన్యాసాలు చేయిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన దున్నరాజులను ప్రదర్శిస్తూ... యాదవులు తమ దర్పాన్ని చూపిస్తున్నారు. వేడుకలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.

Sadar Celebrations
Sadar Celebrations

By

Published : Nov 6, 2021, 9:24 AM IST

తెలంగాణలో అట్టహాసంగా సదర్‌ సంబురాలు..

హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఉత్సవాలను తెరాస మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఎర్రగడ్డ మోతీనగర్ చౌరస్తాలో జరిగిన సదర్ వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, అంజన్​కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. మారేడుపల్లిలో దున్నరాజులకు ప్రత్యేకంగా అలంకరించి సదర్‌ ఉత్సవాలకు తీసుకువచ్చారు. సదర్‌ను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లను చేశారు. హరియాణా నుంచి తీసుకువచ్చిన దున్నరాజులు సందడి చేశాయి. కూకట్‌పల్లి మూసాపేట్‌లో సదర్ ఉత్సవాలు సందడిగా సాగాయి. యాదవ్ బస్తీలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పటం కార్యక్రమాన్ని ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు, డేజేల హోరు మధ్య సదర్‌ సంబరాలు అంబరాన్నంటాయి.

సదర్‌ ఉత్సవాల కోసం హరియాణా నుంచి బాహుబలి అనే ఈ దున్నరాజును తీసుకువచ్చారు.. చెప్పల్‌ బజార్‌కు చెందిన లడ్డూ యాదవ్‌... 3 కిలోల బంగారంతో ఈ గోల్డ్‌ చైన్‌ చేయించి దాని మెడలో వేశాడు. రేపు నారాయణగూడ చౌరస్తాలో జరిగే సదర్‌ వేడుకల్లో ఈ భారీ దున్నపోతు... తన భారీ బంగారు గొలుసుతో ఆకట్టుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details