ఇ-మెసేజ్ ద్వారా గవర్నర్ సందేశాన్ని పొందటానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, ఇ-గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులను సైతం సమర్పించవచ్చని వెల్లడించారు. వెబ్‌సైట్‌లో గవర్నర్ ప్రసంగాలు, కార్యక్రమాలతో ఫొటో గ్యాలరీ, ఇతర విభాగాలు కూడా ఉన్నాయి. రోజువారీ ప్రాతిపదికన రాజ్‌భవన్ అధికారులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచుతారని అధికారులు చెప్పారు. రాజ్‌భవన్ గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలని గవర్నర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌ను http://governor.ap.gov.in/ లేదా http://rajbhavan.ap.gov.in/ ద్వారా సందర్శించవచ్చని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.