రాజధాని అమరావతిలో పోరు మరింత ఉద్ధృతమైంది. ఇన్నాళ్లూ మహాధర్నాలు, నిరసన దీక్షలతో ముందుకు సాగిన రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు... ఇవాళ అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ చేశారు. ఇప్పటికే దుకాణాలు పూర్తిగా మూసేయించారు. దుకాణాలు తెరవాలని పోలీసులు ఒత్తిడి తేవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. షాపులు తెరవనిచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. పోలీసులకు గులాబీ పువ్వులు ఇచ్చి నిరసన తెలిపారు. సకలజనుల సమ్మెకు సహకరించాలని కోరారు. అమరావతిలో రాజధాని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. రోజుకో మాట చెబుతూ అధికార పార్టీ నాయకులు తమను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
'రాజధాని పోరు మరింత ఉద్ధృతం' - రాజధాని పోరు మరింత ఉద్ధృతం
అమరావతి పోరు మరింత ఉద్ధృతమైంది. ఇన్నాళ్లూ మహాధర్నాలు, నిరసన దీక్షలతో ముందుకు సాగిన రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు... ఇవాళ్టి నుంచి ఆందోళన తీవ్రం చేశారు. రాజధాని ప్రాంతంలో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ మూసివేయించేశారు.
rajadhani-farmers-protest-in-amaravathi