ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచే ఆర్టీసీ ఛార్జీల పెంపు - ఏపీఎస్​ఆర్టీసీ వార్తలు

apsrtc
ఏపీఎస్​ఆర్టీసీ

By

Published : Dec 10, 2019, 4:08 PM IST

Updated : Dec 10, 2019, 6:14 PM IST

16:03 December 10

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు ముహూర్తం ఖరారైంది. సంస్థ నష్టాలను  భర్తీ చేసేందుకు ఛార్జీలనుపెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం... దానిని బుధవారం నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు పంపిన దస్త్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. అనంతరం ఛార్జీల పెంపు నిర్ణయాన్నిఅధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్​కు 10 పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు.బస్సుల్లో తొలి రెండు స్టేజీలు లేదా పది కిలోమీటర్ల వరకు  ఛార్జీలను పెంచలేదు. ఆ తర్వాత 75 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు పెంచారు. దూర ప్రాంత ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. నాన్ ఏసీ కేటగిరీలోనిఎక్స్​ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్​కు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఏసీ కేటగిరీ వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం ఛార్జీలు పెంచలేదు. ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో  కిలోమీటర్​కు పది పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు.సిటీ, ఆర్డినరీ బస్సుల్లోమొదటి 11 స్టేజీలు అంటే 22 కిలోమీటర్ల వరకు ఛార్జీలు పెంచడం లేదని ఆర్టీసీ తెలిపింది. అనంతరం కిలోమీటర్​కు 10 పైసల చొప్పున ఛార్జీ పెంచి వసూలు చేయనున్నారు. 

తప్పని పరిస్థితుల్లోనే.. 

2015 అక్టోబర్​లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. అనంతరం ఇప్పుడు మళ్లీ పెరిగాయి. గడచిన నాలుగు సంవత్సరాల్లో డీజిల్ ధరలు 49 రూపాయల నుంచి 70 రూపాయలకు పెరిగాయని ఆర్టీసీ తెలిపింది. దీనివల్ల సంస్థపై  ఏటా రూ.630 కోట్ల భారం పడిందని తెలిపింది. బస్సుల విడి భాగాల ధరలు పెరుగుదల సహా సిబ్బంది జీతభత్యాల పెంపు పల్ల మరో రూ.650 కోట్ల భారం సంస్థపై పడిందని అధికారులు తెలిపారు. ఈ  పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ ఎండీ ఎం.టీ. కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ పెంపు వల్ల ఏటా సుమారు రూ.700 కోట్ల రూపాయల రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇదీ చూడండి:

'వేలం పాడండి.. ఎన్నికలు లేకుండా పదవులు పొందండి!'

Last Updated : Dec 10, 2019, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details