రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక పద్దు(2020-21)పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా బడ్జెట్ తెచ్చారని అన్నారు. అంచనాలు భారీగా చూపారే తప్ప.. ఆచరణ ప్రణాళికలు లేవని దుయ్యబట్టారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని వ్యాఖ్యానించారు. కీలకమైన రంగాలకు బడ్జెట్‌లో కోతలు విధించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంచనాలు చూపారే తప్ప... ఆచరణ ప్రణాళికలు లేవు:పవన్ - andhrapradesh budget highliets
వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి తప్ప...ఆచరణ ప్రణాళికలు లేవని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. కీలకమైన రంగాలకు బడ్జెట్‌లో కోతలు విధించారని అన్నారు.
pawan-kalyan