దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్న వైకాపా నేతల ప్రచారాలు అవాస్తవాలన్నారు. ఈ అంశంపై భాజపా నేతలతో పలుమార్లు చర్చించానని తెలిపారు. సునీల్ దేవ్‌ధర్.. ప్రధాని సహా ఇతర నేతల దృష్టికి తీసుకెళ్లానని.. ఇప్పుడు ఇదే అంశాన్ని జేపీ నడ్డాతో మాట్లాడానని వివరించారు. వైకాపా మూడు రాజధానులు.. వారి భూదాహం తీర్చుకోవడానికే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానుల అంశంపై ప్రధాని, హోంమంత్రికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కోసం ఫిబ్రవరి 2న సంయుక్తంగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు.
3 రాజధానులపై కేంద్రానికి సమాచారం లేదు: పవన్ - మూడు రాజధానులపై దిల్లీలో భాజపా నేతలతో పవన్ భేటీ
మూడు రాజధానుల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్న వైకాపా నేతల ప్రచారాలు పచ్చి అబద్ధాలని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ అంశంపై కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
పవన్ కల్యాణ్