ఏపీలో చేపట్టే ఏ కార్యక్రమమైనా ఇరు పార్టీలు కలిసే చేస్తాయని భాజపా-జనసేన నేతలు స్పష్టం చేశారు. దిల్లీలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసంలో సమావేశమైన భాజపా-జనసేన నేతలు... రాష్ట్రంలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించగా.. భాజపాలో జనసేన విలీనంపై మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్‌ను ప్రశ్న అడిగారు. దీనిపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన ఆయన... జనసేనను భాజపాలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రాజధాని కోసం.. ఫిబ్రవరి 2న భాజపా-జనసేన లాంగ్ మార్చ్