వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఏం శిక్షణ ఇస్తారని ప్రశ్నించారు. ఆ కేంద్రాల్లో క్రికెట్ బెట్టింగ్ ఇతర అసాంఘిక కార్యకలాపాల శిక్షణ ఇస్తారా అని దుయ్యబట్టారు. వైకాపా ఏర్పాటు చేసే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు దొంగ నోట్ల ముద్రణ, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి వాటికే ఉపయోగపడతాయని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఏం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'పెట్టుబడులే లేవు.. కానీ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలా..?' - skill development centers in ap news
ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రానికి తీసుకురాని వైకాపా ప్రభుత్వం.. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఏం చేస్తారో చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
panchumarthi annuradha on skill development centers