ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ పరీక్ష - తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ పరీక్ష

తొలి రోజు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు సంబంధించిన 'కీ' ని అధికారులు విడుదల చేశారు.

గ్రామ సచివాలయ పరీక్ష

By

Published : Sep 1, 2019, 11:51 PM IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేశారు. అక్కడక్కడా కొన్ని అసౌకర్యాలు ఎదురైనా...పరీక్షల నిర్వహణపై అభ్యర్ధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పరీక్షల పేపర్​లో ప్రశ్నలు తాము ఊహించిన దానికన్నా ఎక్కువగా కఠినతరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలపై, పంచాయితీరాజ్‌ సెక్షన్లపై ఎక్కువగా ప్రశ్నలడుగుతారని ఊహించినా...ప్రశ్నపత్రం అందుకు విరుద్ధంగా ఉందని అభ్యర్ధులు విచారం వ్యక్తం చేశారు.

కీ విడుదల
ఉదయం జరిగిన పరీక్షలకు సంబంధించిన 'కీ'ని అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు http://gramasachivalayam.ap.gov.in వెబ్​సైట్​లో 'కీ' చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details