'ఉల్లిపాయ.. ఉల్లిపాయ.. నువ్వు ఏం చేస్తావంటే.. కోసేటప్పుడే కాదు.. కొనేటప్పుడూ కళ్లలో నీళ్లు తెప్పిస్తానందట'.. అలా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి. కేజీ 25 నుంచి 30 రూపాయలు ఉండే ఉల్లి.. నేడు కిలో రూ. 130ల పైనే పలుకుతున్నాయి. ప్రభుత్వం రాయితీ మీద రూ. 25లకే అందిస్తున్నా.. సామాన్యుడి బాధలు మాత్రం తీరడం లేదు. ఉల్లి కోసం ప్రజలు అన్ని పనులూ మానుకుని ఉదయం నుంచే రైతు బజార్లో వరుసల్లో నిలబడుతున్నారు. కేజీ ఉల్లిపాయల కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. అలా అయినా సరిపడా ఉల్లిపాయలు అందుతున్నాయా అంటే.. అదీలేదు. కేజీ అని చెప్తున్నా.. 800 గ్రాములే ఇస్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉల్లి ధరలను నియంత్రించాలని.. కనీసం కుటుంబానికి 5 కేజీల చొప్పునైనా పంపిణీ చేయాలని కోరుతున్నారు.
'ఉల్లి కోసేటప్పుడే కాదు.. కొనేటప్పుడూ కళ్లలో నీళ్లే..!'
ఉల్లిపాయల కోసం సామాన్యుల తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం పనులన్నీ మానుకుని ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడుతూనే ఉన్నారు. వృద్ధులు, మహిళలు గంటల తరబడి వరుసలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉల్లి బారులు