ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: వరదలో కిలోన్నర బంగారు నగలు గల్లంతు!

బంగారు ఆభరణాలు వరద నీటిలో గల్లంతయ్యాయి. అవును మీరు విన్నది నిజమే. ఈ ఘటన హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో చోటు చేసుకుంది. బైక్​పై వెళ్తున్న వ్యక్తి నుంచి... ఆభరణాలతో కూడిన బ్యాగు వరదలో పడి కొట్టుకుపోయింది. బ్యాగ్​ అయితే దొరికింది కానీ... దానిలో బంగారం మాత్రం మాయమైంది. ఇంతకీ ఏం జరిగింది?

వరదలో కిలోన్నర బంగారు నగలు గల్లంతు!
వరదలో కిలోన్నర బంగారు నగలు గల్లంతు!

By

Published : Oct 13, 2020, 9:37 AM IST

హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వీఎస్‌ గోల్డ్‌ ఆభరణాల దుకాణదారుడు జూబ్లీహిల్స్‌లోని కృష్ణ పెరల్స్‌ దుకాణానికి ఓ కొనుగోలుదారు కోసం కిలోన్నర ఆభరణాలను సేల్స్‌మెన్‌ ప్రదీప్‌కు ఇచ్చి శనివారం ఉదయం పంపారు. పని పూర్తయ్యాక.. సాయంత్రం వచ్చి ఆభరణాల సంచి తీసుకున్న ప్రదీప్‌ తన బైకుపై బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3 మీదుగా వర్షంలోనే బయల్దేరాడు.

స్థానిక కిడ్స్‌ పాఠశాల ముందుకు రాగానే వరద వచ్చింది. కాళ్ల మధ్యలో పెట్టుకున్న ఆభరణాల సంచి ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది. దుకాణ యజమానితోపాటు 15 మంది సిబ్బంది శనివారం రాత్రి 10 గంటల వరకు వెతికారు. బ్యాగు అయితే చిక్కింది కానీ... దానిలో నగలు కనిపించలేదు. దుకాణ యజమాని అజయ్‌కుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్‌ను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. సంచిలోని నగలు ఏమయ్యాయనేది ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చూడండి:'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి'

ABOUT THE AUTHOR

...view details