ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధి హామీ బిల్లుల విచారణకు ఐఏఎస్ అధికారులు.. తదుపరి విచారణ 22కి వాయిదా

NAREGA BILLS CASE
NAREGA BILLS CASE

By

Published : Aug 24, 2021, 3:52 PM IST

Updated : Aug 24, 2021, 5:09 PM IST

15:48 August 24

NAREGA BILLS CASE

ఉపాధి హామీ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ. 400 కోట్లు చెల్లించామని.. మరో రూ. 11 వందల కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్.రావత్‌... పంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలియజేశారు. అధికారుల వివరణపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగదు గుత్తేదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. 

దీనిపై స్పందించిన ధర్మాసనం.. గుత్తేదారులకు సొమ్ము చెల్లించి ఆ వివరాలు హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. కేంద్రం నుంచి ఇంకా డబ్బు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలపగా.. తాము మొత్తం చెల్లించామని కేంద్రం తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఏయే పనులు చేశారు.. ఎవరెవరు ఎంతెంత చెల్లించారన్న అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 

Lokesh: 'భరతమాత విగ్రహాన్ని తొలగించటం నిరంకుశత్వానికి నిదర్శనం'

Last Updated : Aug 24, 2021, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details