దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు తప్పుపట్టడంతో పార్టీకి, ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పార్టీ విధానాలకు భిన్నంగా తన వ్యాఖ్యలు ఉండడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు.
ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన సీపీఐ నేత నారాయణ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ నేత నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీకి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు.
ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన సీపీఐ నేత నారాయణ
TAGGED:
latest news on cpi narayana