మంత్రి పేర్ని నానితోనే ఉండే వ్యక్తి, ఆయనపైనే హత్యాయత్నం చేశాడంటే.. ఇదంతా మరో కోడి కత్తి డ్రామాలాంటిదని వేరే చెప్పాలా..? అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ బీసీ నేత అయిన కొల్లు రవీంద్రను రాజకీయంగా అణచిచేసే కుట్ర ఇది అని పేర్కొన్నారు. పోలీసులు ఇకనైనా రవీంద్రను వేధించడం ఆపి, మంత్రిని విచారించి నాటకం గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాడి జరిగిన రోజు నిందితుడుమంత్రితో ఉన్న ఫొటోను లోకేశ్ తన ట్వీట్‌కు జతచేశారు.
'ఇది మరో కోడి కత్తి డ్రామాలాంటిదని వేరే చెప్పాలా..?' - Nara Lokesh Latest Tweets
మంత్రి పేర్ని నానిపై దాడి ఘటన గురించి తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనలో ఏది నిజమో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది కూడా మరో కోడి కత్తి డ్రామాలాంటిదని ధ్వజమెత్తారు.
నారా లోకేశ్ ట్విటర్
ఇదీ చదవండీ... పర్యాటక స్వర్గధామం విశాఖ మన్యం..ప్రత్యేకతలు ఏంటంటే