మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన బోధనలను స్మరించుకుందామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మహాత్ముని కలలు నెరవేరాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలని సూచించారు. పురుషుల్లాగే మహిళలు కూడా సమాన హక్కులు అనుభవించగలగాలని, మత్తు, మాదకద్రవ్యాలు లేనివిధంగా నా దేశం రూపుదిద్దుకోవాలని పేర్కొన్నారు.
nara lokesh: మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు లోకేష్ నివాళులు..
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారు కలలు కన్న దేశాన్ని సాకారం చేయాలని సూచించారు.
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు లోకేష్ నివాళులు..
అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చరిత్ర మననం చేసుకుందామని లోకేశ్ తెలిపారు. రాజకీయాల్లో నైతికత అన్న పదానికి నిర్వచనం లాల్ బహదూర్ శాస్త్రి అని... దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు సంక్షోభం నుంచి గట్టెక్కించిన దార్శనికుడని చెప్పారు.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: ఆఖరి జన్మదినాన గాంధీ ఏం సందేశమిచ్చారు?