సీఎం జగన్ గాల్లో తిరుగుతూ కబుర్లు చెబితే.. రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోవని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గాల్లో మేడలు కట్టడం ఆపాలని.. తాడేపల్లి గడప దాటి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే తుపాను నష్టం తెలుస్తుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా వరద సాయం రూ. 5వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసిన విషయం గుర్తు చేశారు.
అలాంటి జగన్.. ఇప్పుడు 500 మాత్రమే ఇస్తాననటం రివర్స్ టెండరింగ్‌లో భాగమా...? అని ప్రశ్నించారు. నివర్ తుపాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి, 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టం అంచనాలు వేయకుండా, పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.