'శుక్రవారం వస్తే చాలు.. సీఎం సాకులు వెతుక్కుంటారు' - సీఎం జగన్పై లోకేశ్ ట్వీట్లు
శుక్రవారం వస్తే చాలు పాఠశాల పిల్లలు సాకులు చెప్పినట్లు చెప్పి ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రోజూ తాడేపల్లిలోని ఇంట్లో పబ్జీ ఆట ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ.. శుక్రవారం మాత్రం ఏదో ఒక సమీక్ష పెట్టి కోర్టుకు డుమ్మా కొడుతున్నారని ఆరోపించారు. నిన్న సీఎం పోలవరం పర్యటన చూస్తే ఇదే నిజమనిపిస్తోందని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
!['శుక్రవారం వస్తే చాలు.. సీఎం సాకులు వెతుక్కుంటారు' nara lokesh saterical tweets on cm jagan court personal attendance exemption](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6245570-790-6245570-1582968206660.jpg)
నారా లోకేశ్