ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదైతే యుద్ధ వాతావరణం ఎందుకు నెలకొందో వైకాపా మేధావులు సమాధానం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుంది, అద్భుతమైన నగరాన్ని కడతామని జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. శాంతియుతంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారని లోకేశ్ తెలిపారు. అడుగుకో పోలీస్‌ని పెట్టారని దుయ్యబట్టారు. ప్రతి ఇంటి దగ్గరా ఐదుగురు పోలీసులు, ముళ్ల కంచెలు, వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్, లాఠీలు, తుపాకులు పెడతారా? అని నిలదీశారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారని లోకేశ్ మండిపడ్డారు.
'ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు'
ప్రజా ఉద్యమాలు అణచివేయాలనుకోవడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారంటూ ట్వీట్ చేశారు.
'ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు'