సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అనుకూల పత్రిక కోసం ప్రజల సొమ్ము మింగుతున్నారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లు భారం అంటూ...పేదవాడి నోటి దగ్గర కూడును లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వ ప్రకటనల పేరుతో వందల కోట్ల మొత్తాన్ని దోపిడీ చేస్తున్నారని ఆక్షేపించారు.
ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ: లోకేశ్ - తెదేపా నేత నారా లోకేశ్ తాజా వార్తలు
ప్రకటనల పేరుతో వైకాపా ప్రభుత్వం వందల కోట్ల దోపిడీకి పాల్పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
nara lokesh