ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఉగ్రవాది టుండా కేసులో నేడు తుది తీర్పు - నాంపల్లి కోర్టు తాజా వార్తలు

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో నాంపల్లి న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడినట్లు ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాపై అభియోగాలు ఉన్నాయి.

nampalli-court-gives-verdict-on-abdul-karim-tunda
ఉగ్రవాది టుండా కేసులో నేడు తుది తీర్పు

By

Published : Mar 3, 2020, 10:54 AM IST

ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా కేసులో హైదరాబాద్​ నాంపల్లి న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. హుమాయూన్‌నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సీసీఎస్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో టుండా నిందితుడిగా ఉన్నాడు. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. లష్కరే తొయిబాలో కీలక వ్యక్తిగా అబ్దుల్ కరీం టుండా ఉన్నాడు. బాంబుల తయారీ, పేలుళ్లలో నిష్ణాతుడిగా ఇతనికి పేరుంది.

40కు పైగా కేసులు..

1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలోనూ టుండా నిందితుడిగా ఉన్నాడు. ముంబయి పేలుళ్ల తర్వాత పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. పాక్ నుంచే ఐఎస్ఐ, పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించాడు. 2008లో ముంబయిపై ఉగ్రదాడి తర్వాత టుండాను అప్పగించాలని భారత్ కోరింది. 2013 ఆగస్టులో నేపాల్ సరిహద్దులో టుండాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు టుండాపై 40కి పైగా పేలుళ్లకు సంబంధించిన కేసులున్నాయి.

ఇవీ చూడండి:"నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం లేదు"

ABOUT THE AUTHOR

...view details