MP Vijaya Sai Reddy On Floods In AP: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరగిందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీలో వరదలపై రాజ్యసభలో ప్రస్తావించిన ఆయన..రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయన్నారు. వరదల్లో 44 మంది మృతి చెందగా మరో 16 మంది గల్లంతైనట్లు వివరించారు. ప్రాథమిక అంచనా మేరకు రూ.6,054 కోట్ల పంట, ఆస్తి నష్టం జరగిందన్న విజయసాయి..వరద సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
MP Vijaya sai On Floods: వరదలతో నష్టపోయాం..తక్షణమే వెయ్యి కోట్లు ఇవ్వండి: విజయసాయి - MP Vijaya sai On Floods
Vijaya Sai On AP Floods: భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని కొన్ని జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైకాపా ఎంపీ విజయసాయి రాజ్యసభలో ప్రస్తావించారు. వరద నష్టాన్ని పూడ్చటానికి తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
విజయసాయి