ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రైతుల దీక్షా శిబిరాలు ఎత్తేయాలి:  ఆర్కే

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్​ అమల్లో ఉంటే.. రైతుల దీక్షా శిబిరాలను ఎలా అనుమతిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శిబిరాలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం డీజీపీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అమరావతి ధర్నాల్లో చంద్రబాబు బినామీలు, రియల్ ఎస్టేట్​ వ్యాపారులు, తెదేపా కార్యకర్తలు మాత్రమే పాల్గొంటున్నారని ఆరోపించారు.

Mla rk comments on chandrababu about amaravathi
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

By

Published : Jan 13, 2020, 5:18 PM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం
అమరావతిలో రైతుల దీక్షా శిబిరాలను వెంటనే ఎత్తివేయాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులను కోరారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దీక్షా శిబిరాలను వెంటనే ఎత్తివేయాలని డీజీపీని కోరతామన్నారు. ధర్నా చేస్తున్న వారిలో నిజమైన రైతులు కేవలం పదిశాతం మందే ఉన్నారని, మిగిలిన వారంతా చంద్రబాబు బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పక్క జిల్లాల తెదేపా కార్యకర్తలేనని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.

బినామీల కోసమే జోలెపట్టిన చంద్రబాబు: ఆర్కే

దీక్షా శిబిరాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, చట్టాలు అతిక్రమించి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు సభలు ఏర్పాటు చేస్తున్నారని ఆక్షేపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ర్యాలీ చేస్తుంటే.. 144 సెక్షన్ ఉందని పోలీసులు తనను అడ్డుకున్నారన్నారు. అమరావతిలో 144 సెక్షన్ ఉన్నా.. దీక్షా శిబిరాలు ఎందుకు కొనసాగిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు జోలె పట్టారని విమర్శించారు. నమ్మి భూములిచ్చిన రైతులను జోలె పట్టించేలా చేశారని, చంద్రబాబు మాటలు నమ్మొద్దని రైతులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details