ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అభివృద్ధి వికేంద్రీకరణకే మూడు రాజధానులు' - capital amaravati

ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి పినిపే విశ్వరూప్ వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

minister pinipe viswanath
మంత్రి పినిపే

By

Published : Dec 21, 2019, 10:47 PM IST

మీడియాతో మంత్రి పినిపే విశ్వరూప్

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం సముచితమైనదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్​లోనే జరిగిందని ... ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం బెల్లంపూడిలో బలహీన వర్గాల గృహ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

ABOUT THE AUTHOR

...view details