ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2023 మార్చి నాటికి.. 100 శాతం స్మార్ట్ మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి - వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు

PEDDI REDDY ON SMART METERS : 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 41 వేల స్మార్ట్​ మీటర్లు బిగించామని.. త్వరలోనే మరో 77వేల కనెక్షన్లకు స్మార్ట్​మీటర్లు బిగిస్తామన్నారు.

MINISTER PEDDI REDDY ON SMART METERS
MINISTER PEDDI REDDY ON SMART METERS

By

Published : Sep 29, 2022, 4:54 PM IST

MINISTER PEDDI REDDY ON SMART METERS : వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 41 వేల స్మార్ట్​మీటర్లు బిగించామని.. త్వరలోనే మరో 77వేల స్మార్ట్​మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. 2023 మార్చి నాటికి వంద శాతం స్మార్ట్ మీటర్లు బిగిస్తామని వెల్లడించారు. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డీబీటీ కోసం ఖాతాలను తెరిచారని.. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదని తెలిపారు.

స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందన్నారు. పైలట్ ప్రాజెక్టు చేపట్టిన శ్రీకాకుళం జిల్లాలో ఇది నిరూపితమైంది. స్మార్ట్ మీటర్లపై మాట్లాడే ప్రతిపక్షాలు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలని సూచించారు. చంద్రబాబుకు వంతపాడుతున్న జనసేన, కమ్యూనిస్టు నేతలే అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.

''2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు. సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు 41 వేల స్మార్ట్​మీటర్లు బిగించామని.. త్వరలోనే మరో 77వేల స్మార్ట్​ మీటర్లు బిగించేందుకు సిద్దమవుతున్నాం. విద్యుత్ రాయితీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తాం. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు ఏమీ నష్టపోరు. స్మార్ట్ మీటర్ల వల్ల రాయితీల్లో ప్రభుత్వానికి 30 శాతం ఆదా."-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details