ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'యువతకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు' - Minister Gowtham Reddy Latest news

విదేశాల్లో ఉద్యోగాలు సులభంగా పొందేలా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండియన్ ఇంటర్నేషనల్ స్కిల్స్ సెంటర్ ప్రణాళికలోనూ ఓమ్​క్యాప్ భాగస్వామ్యమైందని మంత్రి వెల్లడించారు. ఓమ్ క్యాప్ ద్వారా జర్మనీతో పాటు గల్ఫ్ దేశాలు, ఇతర యూరోపియన్ దేశాల్లో 3 వేల మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

Minister Mekapati Gowtham Reddy Review On OMCAP
మంత్రి గౌతమ్ రెడ్డి

By

Published : Nov 17, 2020, 6:50 PM IST

రాష్ట్రానికి చెందిన యువత విదేశాల్లో ఉద్యోగాలు సులభంగా పొందేలా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఓవర్సీస్ మ్యాన్​ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓమ్ క్యాప్) ద్వారా జర్మనీతో పాటు గల్ఫ్ దేశాలు, ఇతర యూరోపియన్ దేశాల్లో 3 వేల మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. తాడేపల్లిలోని ఆ సంస్థ 23వ బోర్డు సమావేశానికి హాజరైన మంత్రి.. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఓమ్ క్యాప్ ద్వారా 2 వేల మంది యువతను విదేశాల్లో ఉపాధి కోసం పంపినట్టు తెలిపారు.

కొవిడ్ కారణంగా ఆశించినంతగా శిక్షణా కార్యక్రమాలను చేపట్టలేదని మంత్రి గౌతమ్​రెడ్డి తెలిపారు. ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, నర్సులు, లిఫ్ట్ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు సంబంధించి మరో రెండు వేల వరకూ ఖాళీలు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రత్యేకించి జర్మనీలోనే వెయ్యికిపైగా నర్సు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవకాశముందని మంత్రి వెల్లడించారు. విదేశాల్లో ఈ తరహా ఉద్యోగాలకు సంబంధించి వివిధ సంస్థలతోనూ ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు. కొవిడ్ కారణంగా విదేశాలకు వెళ్లలేకపోయిన వారి కోసం స్థానికంగా ఉద్యోగ ఆసరా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామని.. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముందని మంత్రి తెలిపారు.

ఇండియన్ ఇంటర్నేషనల్ స్కిల్స్ సెంటర్ ప్రణాళికలోనూ ఓమ్​క్యాప్ భాగస్వామ్యమైందని మంత్రి వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఎన్.ఎస్.డి.సి వివిధ దేశాల్లో ప్రస్తుతం, భవిష్యత్తులో ఉండబోయే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఓమ్​క్యాప్​కు ఇస్తారని.. అందుకు అవసరమైన శిక్షణను తిరుపతి, విజయవాడ, కాకినాడ, వైజాగ్ నగరాలలో అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే 2 న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ సెంటర్లు రాజమహేంద్రవరం, పులివెందులలో శిక్షణ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ABOUT THE AUTHOR

...view details