ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KTR Fire on BJP: కేసీఆర్ సాఫ్ట్ అనుకుంటున్నారేమో.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది: కేటీఆర్ - మంత్రి కేటీఆర్

వరి సాగుచేయొద్దంటూ దిల్లీ భాజపా వాళ్లు ఉత్తరాలు రాస్తారని.. సిల్లీ భాజపా (తెలంగాణ భాజపా నేతలను ఉద్దేశించి) వరి సాగుచేయాలంటున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని కామారెడ్డిలో పర్యటించిన కేటీఆర్(ktr latest news).. కాంగ్రెస్​, భాజపా నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం(Minister KTR Fire on Bjp and Congress) చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాఫ్ట్ అయిపోయారు అనుకుంటున్నారేమో.. కానీ లోపల ఒరిజినల్ అట్లనే ఉందన్నారు.

MINISTER KTR FIRES ON BJP AND CONGRESS
మంత్రి కేటీఆర్

By

Published : Nov 9, 2021, 6:03 PM IST

కేసీఆర్ సాఫ్ట్ అనుకుంటున్నారేమో.. లోపల ఒరిజినల్ అట్లనే ఉంది: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలోని కామారెడ్డిలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, భాజపా నేతలపై మండిపడ్డారు(Minister KTR Fire on Bjp and Congress). పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను గొప్పగా పొగుడుతుంటే.. మన రాష్ట్రంలోని నేతలకు మాత్రం అభివృద్ధి కనిపించట్లేదని మండిపడ్డారు. బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాత్రమే రాష్ట్రాన్ని బాగుచేస్తారని ప్రజలు అధికారం ఇచ్చారన్నారు.. కేటీఆర్​. అభివృద్ధి గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే గమ్మత్తు అనిపిస్తోందన్నారు.

కల్యాణలక్ష్మి లాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా?.. వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా..? భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఉన్నాయా.. ? అని ప్రశ్నించారు. ఇప్పుడు అందరూ తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ వచ్చాక సాధించిన విజయాలను వివరించేందుకు ఈనెల 29న వరంగల్​లో 'తెలంగాణ విజయ గర్జన' పేరిట సభ నిర్వహిస్తున్నట్లు చెప్పిన కేటీఆర్​.. ఆ సభకు భారీగా జనం తరలిరావాలని కోరారు. ఆ జనాలను చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నారు.

వరి కొనుగోళ్ల వ్యవహారంపైనా కేటీఆర్​ స్పందించారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందుబాటులో ఉన్న జలవనరుల ఫలితంగా అధిక మొత్తంలో వరి సాగవుతోందని కేంద్రం చెప్పినట్లు కేటీఆర్​ తెలిపారు. పండిన మొత్తం వరి ధాన్యాన్ని కొనలేమని కేంద్రమే చెప్పిందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. వరి సాగు నుంచి రైతులను దృష్టిమళ్లించాలని.. ప్రత్యామ్నాయాలను చూపించాలని కేంద్రం లేఖలు రాసినట్లు కేటీఆర్​ చెప్పారు. వరి వద్దని దిల్లీ భాజపా వాళ్లు ఉత్తరాలు రాస్తారని.. సిల్లీ భాజపా (తెలంగాణ భాజపా నేతలను ఉద్దేశించి) వరి పండించాలంటోందని సెటైర్లు వేశారు.

వరి కొనుగోళ్లు చేయాలంటూ ఈనెల 12న కామారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేటీఆర్​ చెప్పారు. కామారెడ్డి దద్దరిల్లిపోయేట్లు ధర్నా చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చే విధంగా.. మనం సత్తా చాటాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్​ సూచించారు.

'నిన్న.. మొన్న పేపర్​లో చూసిన.. చదువుతే గమ్మత్తు అనిపించింది. కేసీఆర్​.. ముఖ్యమంత్రి కాంగానే సాఫ్ట్​ అయిపోయిండేమో.. సల్లబడ్డారేమో అనుకున్నారు. గానీ లోపల ఒరిజినల్​ గట్లే ఉన్నది. ఏం మారలేదు. కొంత మంది మిత్రులు మెసేజ్​లు పంపుతున్నారు. అన్నా మళ్లొక్కసారి ఉద్యమం నాటి కేసీఆర్​ను చూసినట్లు అనిపించిందని చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతదాకైనా కొట్లాడుదాం. రాబోయే 80 ఏళ్లు తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాసను నిలబెడదాం.

- కేటీఆర్​, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details